రాగం: నాదనామక్రియ -శ్రీరామనామం మరువాం మరువాం
శ్రీరామనామం మరువాం మరువాం
సిద్ధము యమునకు వెరువాం వెరువాం !!శ్రీరామనామం !!
గోవిందునేవేళ గొలుతాం గొలుతాం
దేవుని గుణములు దలుతాం దలుతాం !!శ్రీరామనామం !!
విష్ణుకథలు చెవుల విందాం విందాం
వేరేకథలు చెవుల మందాం మందాం !!శ్రీరామనామం !!
రామదాసులు మాకు సారాం సారాం
కామదాసులు మాకు దూరాం దూరాం !!శ్రీరామనామం !!..
నారాయణుని మేము నమ్మేం నమ్మేం
నరులన్నింక మేము నమ్మాం నమ్మాం !!శ్రీరామనామం !!
మాధవనామము మరువాం మరువాం
మరి యమబాధకు వెరువాం వెరువాం !!శ్రీరామనామం !!
అవనిజపతిసేవ మానాం మానాం
మరియొక జోలంటే మౌనాం మౌనాం !!శ్రీరామనామం !!
భద్రగిరీశుని కందాం కందాం
భద్రముతో మనముందాం ముందాం !!శ్రీరామనామం !!

No comments:
Post a Comment