రాగం : గౌళిపంతువరాళి - శ్రీరామ నీనామ మేమిరుచిరా
శ్రీరామ నీనామ మేమిరుచిరా ఓరామ నీనామ మెంతరుచిరా
కరిరాజ ప్రహ్లాద ధరణి విభీషణుల గాచిన నీనామ మేమిరుచిరా
కదళీ ఖర్జూరాది ఫలములకధికమౌ కమ్మన నీనామ మేమిరుచిరా
నవరసములకన్న నవనీతములకంటె నధికమౌ నీనామ మేమిరుచిరా
పనస జంబూ ద్రాక్ష ఫలరసములకంటె నధికమౌ నీనామ మేమిరుచిరా
అంజనతనయ హృత్కమలంబునందు రంజిల్లు నీనామమేమిరుచిరా
శ్రీసదాశివుడు తానేవేళ భజియించు శుభరూప నీనామ మేమిరుచిరా
సారములేని సంసార తరణమునకు తారకము నీనామమేమిరుచిరా
శరణన్న జనులను సరగున రక్షించు బిరుదుగల్గిన నామమేమిరుచిరా
తుంబుర నారదుల్ డంబుమీరగ గానంబుజేసెడి నీనామమేమిరుచిరా
అరయ భద్రాచల శ్రీరామదాసుని ఏలిన నీ నామమేమి రుచిరా

No comments:
Post a Comment