Sunday, May 14, 2017

ముమ్మిడివరం పెదబాలయోగీశ్వరులు

ముమ్మిడివరం పెదబాలయోగి ఋషులు ఏ అరణ్యాల్లోనో ముక్కుమూసుకుని తపస్సు చేసుకుంటారని చెప్పే కావ్యాలు, తెలుగు వాచకాల మధ్య సరిగ్గా 82 ఏళ్ల క్రితం ఒక సామాన్యుడు ఋషియై జనావాసాల మధ్య తపస్సు చేశాడు. యోగమూ తపస్సూ ఉత్త ట్రాష్ అనుకునే అత్యాధునిక సాంకేతిక యుగంలో తన కఠోర తపోదీక్షతో యోగశక్తిని చాటి చూపించాడో మౌని. అయితే ఆయన ఏనాడూ , ప్రవచనాలనూ చెప్పలేదు. ఆయన బాలయోగి. ఊరు పేరుతో ఈశ్వరత్వాన్ని జోడించుకున్న ముమ్మిడివరం పెదబాలయోగీశ్వరులు.
1930 అక్టోబర్ 23న తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం గ్రామంలో ఒక పేద కుటుంబంలో కటికదల గంగయ్య రామమ్మ దంపతులకు మూడో సంతానంగా జన్మించాడు సుబ్బారావు. వంశపారం పర్యంగా వచ్చే గోపాలక వృత్తిలో సుబ్బారావు అయిష్టంగానే చేరాడు. చదువుకునే అదృష్టం ఎటూ లేదు. ఎరుకనిచ్చే చదువు వేరే ఉందని గ్రహించిన సుబ్బారావు తన 16వ ఏట 1946 మే 22న కృష్ణుడు నారదుల ఫోటోతో సమీపంలోని కొబ్బరితోటలోకి వెళ్ళి తపస్సుకు కూర్చున్నాడు. తల్లిదండ్రులు వారించి తీసుకొచ్చారు.
ఇంటిదగ్గరా అదే బాట. ఇక లాభం లేదనుకుని ఇంటి ప్రాంగణంలోనే కొబ్బరాకులతో పందిరి కట్టారు. పదహారేళ్ల ప్రాయం వాడు కఠోర తపస్సా అని ఆనోట ఈనోట పాకి భక్తజనం పోటెత్తారు. ఆ ఇల్లు, ఆ వాడ, ఆ ఊరు ఒక ముక్తిథామం అయిపోయింది. అలా రెండు సంవత్సరాల 8 నెలలు ఆయన కనువిప్పి లోకాన్ని చూసిందీ లేదు,
పెదవి విప్పి సంభాషించిందీ లేదు. అందుబాటులో ఉన్న దేవుడని అందరూ పాదాల్ని స్మృశించి, చుట్టూ గుమ్మిగూడుతుంటే తపస్సుకు ఇది మార్గం కాదనుకుని ఆయన లోలోపలి గదుల్లోకి వెళ్లిపోయారు. ఈ సంగతి తెలుసుకున్న మహర్షి ఈలి వాడపల్లి ఆయన్ని దర్శించి ఇతను బాలయోగి అన్నారు. అప్పటి వరకూ ప్రతిరోజూ దర్శనం ఇచ్చే బాలయోగి ఇక మీదట వద్దన్నారు. భక్తులు, నిర్వాహకులు కోరితే 16-2-1950 నాటి నుంచి మహాశివరాత్రి మరుసటి రోజు దర్శనానికి అనుగ్రహించారు. అప్పటి నుంచి తన అవతార పరిసమాప్తి అయిన 19.7.1985 వరకు బాలయోగి భక్తులకు దర్శనం ఇస్తూనే ఉన్నారు. అయితే ఈ మధ్యలోనే ఆయన తనేమిటో తన తపోశక్తి ఏమిటో అనేక నిదర్శనాల ద్వారా తెలియజేశారు.
అదలా ఉంచితే ఎవరైనా ఒక వ్యక్తి 40 ఏళ్ళపాటు నిరాహారంగా, స్వీకార విసర్జనలు లేకుండా వుండటం సాధ్యమా అని ప్రశ్నలు లేవనెత్తిన తరుణంలో బాలయోగి దానికి తార్కాణంగా నిలిచారు. సంప్రదాయమైన యోగవిద్యను వశపరచుకున్న బాలయోగి అష్టాంగ యోగం ద్వారా సమాధిలోకి వెళ్ళిపోయి ఆకలి దప్పులను విసర్జించారు. భారతీయ యోగ సంప్రదాయంలో ఆపాద మస్తకము విస్తరించిన కుండలినీ శక్తిని జాగృతం చేసి, వెన్నువెన్నంటి నడిచే శుషమ్నా నాడిద్వారా ప్రయాణించి ఆజ్ఞ, విశుద్ధ, అనాహత, మునిపుర, స్వాథిస్థాన, మూలాధార చక్రాలను దాటి సహస్రార చక్రాన్ని చేరడాన్ని జీవైక్యంగా ప్రతిపాదించారు. బాలయోగి దాన్ని ఆచరణలో చేసి చూపించారు. 

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...