శ్రీ కృష్ణ జననం -- పారమార్ధిక సత్యం
పుట్టుక యే లేని పరమాత్మ పుట్టడం వింతలలోకెల్లా వింత ! అది కూడా అర్ధ రాత్రి , చెరసాలలో భయంకరమైన రాక్షసుల మధ్య , మాధవ జననం ఒక మహాద్భుతం ..
శ్రీ కృష్ణ జననం పారమార్ధిక మైన ఎన్నో రహస్యాలకి ఆలవాలం
శ్రీ కృష్ణుడు దేవకీ దేవి అష్టమ గర్భం -- ముందు యేడు గర్భాలు దాటుకుని పుట్టిన ఎనిమిదో గర్భం , పరాత్పర సత్యం..
అష్టాంగ యోగంలో మొదటి ఏడు దశలను ( ఏడు గర్భాలు ) దాటాకా సాధకునికి కలిగే ఆఖరి దశ , ఎనిమిదో దశ -- సమాధి .. ఇక ఇంతే దీనితో యోగి కుండలిని సహస్రారకం చేరుకుంటుంది , విరాట్స్వరూపం అవగతమవుతుంది .. అదే కృష్ణ జననం ...
గీతలో మొదటి శ్లోకము ధర్మక్షేత్రే కురు క్షేత్రే
గీతలో ఆఖరి శ్లోకము ఆఖరి పాదము ధృవా నీతిర్ మతిర్ మమ
మొదటి పాదము మొదటి అక్షరము ధ.
గీతలో ఆఖరి శ్లోకము ఆఖరి పాదము ఆఖరి అక్షరము మ.
కలిపితే ధమ అనగా ధర్మము అని అర్థం. అనగా గీత మొత్తం ధర్మబోధే.
గీతా ని తిరగరాస్తే తాగీ అనగా త్యాగం అని అర్థం.
మల, విక్షేపణ, ఆవరణ దోషములు త్యాగం చేయమని అర్థం.
18 అనే సంఖ్య గీతలో చాలా ముఖ్యమైనది.
గీతలోని అధ్యాయములు 18
మహాభారత యుద్ధంజరిగినది 18 రోజులు
మొత్తం కౌరవ + పాండవసేన = 11 + 07 = 18 అక్షౌహిణీలు
మహాభారత పర్వములు 18
అక్షౌహిణీ అనగా
ఏనుగులు 21870 2+1+8+7+0 = 18
రథములు 21870 2+1+8+7+0 = 18
గుఱ్ఱములు 68610 6 + 8+ 6+ 1+ 0 = 18
నేలమీద యుద్ధ చేసే సైనికులు 109350 1+ 0+ 9+ 3+ 5+ 0 = 18
No comments:
Post a Comment