Tuesday, May 30, 2017

రాగం : మోహన - పాడెద నీ నామమె గోపాలా

రాగం : మోహన - పాడెద  నీ నామమె  గోపాలా 

పాడెద  నీ నామమె  - గోపాలా
హృదయములోనే  పదిలముగానే
నిలిపితి నీ  రూపమేరా
1. మమతలలోనే - మల్లికలల్లి
నిలిచితినీ నీ కోసమేరా
ఆశలతోనే హారతిచేసి
పదములు  పూజింతురా !! పాడెద  నీ నామమె !!

2. నీ  మురళి గానమే పేలచేరా
కన్నుల నీ మోము కదిలెనురా
పొన్నలు  పూచే బృందావనిలో
వెన్నెల కురిసేనురా
నీ సన్నిధిలో జీవితమంతా
కానుక చేసెనురా !! పాడెద  నీ నామమె !!


No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...