Tuesday, May 30, 2017

రాగం : మోహన -- జయ కృష్ణా ముకుందా మురారి

రాగం : మోహన -- జయ కృష్ణా ముకుందా మురారి..
ఆలాపన :
హే కృష్ణా... ముకుందా... మురారీ...
జయ కృష్ణా ముకుందా మురారి..
జయ కృష్ణా ముకుందా మురారి..


1. దేవకి పంట వసుదేవు వెంట..
దేవకి పంట వసుదేవు వెంట..
యమునను నడిరేయి దాటితివంటా... ఆ... ఆ... ఆ...
వెలసితివంట నందుని ఇంట
వెలసితివంట నందుని ఇంట
రేపల్లె ఇల్లాయెనంటా.. ఆ ఆ..!! జయ కృష్ణా !!

2. నీ పలుగాకి పనులకు గోపెమ్మ
నీ పలుగాకి పనులకు గోపెమ్మ
కోపించి నిను రోట బంధించెనంట.. ఆ .. ఆ...
ఊపున బోయి మాకుల గూలిచి..
ఊపున బోయి మాకుల గూలిచి..
శాపాలు బాపితి వంటా.. ఆ..  !! జయ కృష్ణా !!

3. మ్మా.. తమ్ముడు మన్ను తినేనూ..
చూడమ్మా అని రామన్న తెలుపగా..
అన్నా అని చెవి నులిమి యశోద
ఎదన్నా నీ నోరు చూపుమనగా...ఆ.. ఆ.. ఆ... ఆ...
చూపితివట నీ నోటను
బాపురే పదునాల్గు భువన భాండమ్ముల
ఆ రూపము గనిన యశోదకు
తాపము నశియించి జన్మ ధన్యతగాంచెన్... !! జయ కృష్ణా !!


4 కాళీయ ఫణిపణ జాలాన ఝణఝణ
కాళీయ ఫణిపణ జాలాన ఝణఝణ
కేళీ ఘటించిన గోపకిశోరా.. ఆ.. ఆ..ఆ..
కంసాది దానవ గర్వాపహార
కంసాది దానవ గర్వాపహార
హింసా విదూరా.. పాప విదారా.. !! జయ కృష్ణా !!

5. కస్తూరీ తిలకం లలాట ఫలకే
వక్షస్థలే కౌస్తుభం
నాసాగ్రే నవమౌక్తికం..
కరతలే వేణుం.. కరే కంకణం
సర్వాంగే హరిచందనంచ కలయం
కంఠేచ ముక్తావళీం
గోపస్త్రీ పరివేష్ఠితో
విజయతే గోపాల చూడామణీం
విజయతే గోపాల చూడామణీం  !! జయ కృష్ణా !!


6 లలిత లలిత మురళీ స్వరాళీ
లలిత లలిత మురళీ స్వరాళీ
పులకిత వనపాళీ గోపాళీ
పులకిత వనపాళీ
విరళీకృత నవ రాసకేళీ
విరళీకృత నవ రాసకేళీ
వనమాలీ శిఖిపింఛ మౌళి
వనమాలీ శిఖిపింఛ మౌళి  !! జయ కృష్ణా !!

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...