రామ చక్కని సీతకి అరచేత గోరింట..
ఆలాపన:
నీల గగన ఘనవిచలన..
ధరణిజ శ్రీ రమణ
ఆ.. ఆ...ఆ ..
మధుర వదన నళిన నయన
మనవి వినరా రామా..
1. రామ చక్కని సీతకి
అరచేత గోరింట..
ఇంత చక్కని చుక్కకీ..
ఇంకెవడో మొగుడంట..!! రామ చక్కని సీతకీ.. !!
2. ఉడత వీపున వేలు విడిచిన
పుడమి అల్లుడు రాముడే..
ఎడమ చేతను శివుని విల్లును
ఎత్తిన ఆ రాముడే..
ఎత్తగలడా సీత జడనూ
తాళి కట్టే వేళలో..?? !! రామ చక్కని సీతకీ.. !!
3. ఎర్రజాబిలి చేయిగిల్లి
రాముడేడని అడుగుతుంటే..
చూడలేదని పెదవి చెప్పే..
చెప్పలేమని కనులు చెప్పే..
నల్లపూసైనాడు దేవుడు
నల్లనీ రఘురాముడూ..!! రామ చక్కని సీతకీ.. !!
4. చుక్కనడిగా దిక్కునడిగా..
చెమ్మగిల్లిన చూపునడిగా..
నీరు పొంగిన కనులలోన
నీటి తెరలే అడ్డునిలిచే...
చూసుకోమని మనసు తెలిపే..
మనసు మాటలు కాదుగా..!! రామ చక్కని సీతకీ.. !!
ఆలాపన:
నీల గగన ఘనవిచలన..
ధరణిజ శ్రీ రమణ
ఆ.. ఆ...ఆ ..
మధుర వదన నళిన నయన
మనవి వినరా రామా..
1. రామ చక్కని సీతకి
అరచేత గోరింట..
ఇంత చక్కని చుక్కకీ..
ఇంకెవడో మొగుడంట..!! రామ చక్కని సీతకీ.. !!
2. ఉడత వీపున వేలు విడిచిన
పుడమి అల్లుడు రాముడే..
ఎడమ చేతను శివుని విల్లును
ఎత్తిన ఆ రాముడే..
ఎత్తగలడా సీత జడనూ
తాళి కట్టే వేళలో..?? !! రామ చక్కని సీతకీ.. !!
3. ఎర్రజాబిలి చేయిగిల్లి
రాముడేడని అడుగుతుంటే..
చూడలేదని పెదవి చెప్పే..
చెప్పలేమని కనులు చెప్పే..
నల్లపూసైనాడు దేవుడు
నల్లనీ రఘురాముడూ..!! రామ చక్కని సీతకీ.. !!
4. చుక్కనడిగా దిక్కునడిగా..
చెమ్మగిల్లిన చూపునడిగా..
నీరు పొంగిన కనులలోన
నీటి తెరలే అడ్డునిలిచే...
చూసుకోమని మనసు తెలిపే..
మనసు మాటలు కాదుగా..!! రామ చక్కని సీతకీ.. !!
No comments:
Post a Comment