Tuesday, May 30, 2017

జయ జయ శుభకర వినాయక - శ్రీ కాణిపాక

జయ జయ శుభకర వినాయక - శ్రీ కాణిపాక 


జయ జయ శుభకర వినాయక - శ్రీ కాణిపాక వర సిద్ది వినాయక !

బాహుదా నది తీరం లోన, బావిలో..న వెలసిన దేవ
మహిలో జనులకు మహిమలు చాటి
ఇహపరములనిడు మహానుభావ 
ఇష్టమైనవీ - వొదిలిన నీ కడ 
ఇష్టకార్యములు తీర్చే గణపతి 
కరుణను కురియుచు 
 వరముల నొసగుచు  నిరతము పెరిగే - మహాకృతి

సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి
నీ గుడి లో చేసే - సత్య ప్రమాణం
ధర్మ దేవతకు నిలుపును ప్రాణం 
విజయ కారణం  విఘ్న నాశనం - కాణిపాకమున నీ దర్శనం  ||జయ||

పిండి బొమ్మవై ప్రతిభ చూపి - బ్రహ్మాండ నాయకుడివైనావు 
మాతా పితలకు ప్రదక్షణముతో మహా గణపతిగ మారావూ 
భక్తుల మొరలాలించి, బ్రోచుటకు - గజముఖ గణపతివైనావు 
బ్రహ్మాండమునే బొజ్జలో దాచి - లంబోదరుడివి అయినావు 

లాభము, శుభమూ, కీర్తి ని కూర్చగ - లక్ష్మీ గణపతివైనావు
వేద పురాణములఖిల శాస్త్రములు - కళలూ చాటును నీ వైభవం 
వక్రతుండమే - ఓంకారమై ... విబుధులు చేసే నీ కీర్తనం  ||జయ||

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...