Wednesday, May 31, 2017

వైకుంఠమందు వెలసిన ఓ శ్రీ మహాలక్ష్మీ

వైకుంఠమందు వెలసిన ఓ శ్రీ మహాలక్ష్మీ

వైకుంఠమందు వెలసిన ఓ శ్రీ మహాలక్ష్మీ
నీ భక్తులను కనికరించ రావేమమ్మ !!వైకుంఠమందు!!

శేషశయ్య పై నువ్వు వెలసి వున్నావు
నీ పతి సేవలో నీవు ఎపుడు మునిగి వున్నావు
ఈ గతిలేని పేదల మొర లలించమ్మ
ఏ గతి ఐనా మమ్మెపుడు ఏలు కోవమ్మ !!వైకుంఠమందు!!

కలిగున్నవారి లోగిలిలో నీవు వున్నావు
ఈ కలిలోన ఆకలితో మేము వున్నాము
కలకాలం మా కొరతలు తీర్చవేమమ్మ
ఈ కలియుగ మానవునికి మోక్షమియమ్మ !!వైకుంఠమందు!!

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...