Wednesday, May 31, 2017

మంగళాలయ నీకు మంగళమమ్మ

మంగళాలయ నీకు మంగళమమ్మ

మంగళాలయ నీకు మంగళమమ్మ
రంగధాముని కొమ్మ రక్షించవమ్మా

క్షీరాబ్ది కన్యక చేకొనవమ్మా
నారాయణుని రాణి నా ఇంట నిలుమా || మంగళాలయ ||

శ్రీరంగమందున వెలసిన మాయమ్మ
కామితార్థము సీతా రాములకిమ్మా || మంగళాలయ ||

మంత్రపురమందునా వెలసిన మాయమ్మ
మముగన్న మా తల్లి మహాలక్ష్మి వమ్మ || మంగళాలయ ||

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...