Sunday, May 14, 2017

శ్రీ శ్రీ నిమ్మల వెంకట సుబ్బారావు గారు అవధూత



పవిత్ర భారతదేశంలో అప్పుడప్పుడు మహాత్ములు అవతరించి ప్రజలలో చైతన్యం రేకెత్తించి సర్వధర్మ ప్రభోదం గావించి లోకకల్యాణాన్ని సాధించారు. అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్న ప్రజానీకానికి సుజ్ఞాన జ్యోతిద్వారా బంధ విముక్తులను గావించి సన్మార్గమునకు మళ్లించారు. ఈ కోవకు చెందిన వారే శ్రీశ్రీశ్రీ నిమ్మల వెంకట సుబ్బా రావు గారు . మహామహిమాన్వితుడు, సిద్ధపురుషుడైన శ్రీ నిమ్మల వెంకట సుబ్బా రావు గారిని గురించి తెలియని వారుండరు. ఆలుపెరుగని ఆద్యాత్మిక తత్వవేత్త, ఆడంబరాలు లేని మహోన్నత మేరు శిఖరం  భక్తులు ప్రేమతో అయ్యగారు , సుబ్బారావు సాధువు గారు , గురువు గారు  అంటూ  ఆప్రాయంగా పిలుచుకోగలిగిన నిండైన ప్రేమ పరిమళం శ్రీశ్రీశ్రీ నిమ్మల వెంకట సుబ్బా రావు గారు.. భక్తులు విజయవాడలో ఉన్న వారి ఆశ్రమం లో నిత్యపూజలు, ఆరాధనా కార్యక్రమాలు అత్యంత శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తున్నారు.

శ్రీ శ్రీ నిమ్మల వెంకట సుబ్బారావు గారు అవధూత :

అ - అనగా అక్షరుడు, నాశములేనివాడు,


వ - అనగా వరేణ్యుడు (బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడు),

ధూ - అనగా ధూత (విదిలించుకొన్న) సంసార బంధనములు కలవాడు,

త - అనగా తత్వమస్యాది వాక్యములకు లక్ష్యమైనవాడు

వీరు ఆదిమధ్యాంతములందు , వాసనలనుండి (పూర్వకర్మలనుండి) విడివడినవారు , నిరామయమైన, పరబ్రహ్మగా పేర్కొనదగినవారు , వర్తమానములోనే (భూతభవిష్యత్తుల గురించిన ఆలోచనలేక) ఉండేవారు సద్గురువు గా విరాజిల్లు తూ వారి తత్వాన్ని ప్రభోదించేవారు

భూమి అంతయూ కాగితము చేసి, మొత్తము అడవుల్లోని కర్రని కలముగా  చేసి, ఏడు సముద్రాల్ని ఇంకుగా చేసిన సరే గురువు యొక్క గుణాల్ని వ్రాయలేము. గురువు యొక్క మహిమ అనంతం. గురువు యొక్క జ్ఞానం అమూల్యమైనది. అందుచేత గురువు యొక్క గుణాల్ని ఎన్నని వ్రాయగల్గుతాము? ఎప్పటివరకు మనకు గురువు యొక్క జ్ఞానము లభించదో అప్పటి వరకు ఈ సంసారిక బంధనాలను నుంచి ముక్తి పొందలేము . ఈ మాట సత్య ప్రామాణికమైనది. జ్ఞానం కోసం సద్గురువు యొక్క అమృతమయమైన సదుపదేశ ప్రవచనం వినాలి. సత్య సాక్షాత్కారము కోసం శిష్యులకు సద్గురువే ఆధారము.      కోటి సూర్యులు ఉదయించిన, కోటి చంద్రులు ఉదయించిన ఆ ప్రకాశము తో అజ్ఞాన రూపి అయిన అంధకారము పోదు. చంద్రుని వల్ల , సూర్యుని వల్ల  బాహ్య ప్రపంచానికి వెలుగు దొరుకుతుంది. కాని గురువు  యొక్క సమ్యక జ్ఞానము వల్ల హృదయములో ఉన్న అంధకారము పోతుంది.
తాళం చెవులు లేకుండా తలుపు ఏవిధంగా  రాదో, అదే విధంగా గురువు ఉపదేశం లేకుండా, ఆత్మా జ్ఞానాన్ని తెలుసుకోలేరు.చెట్టు తన దగ్గరకు వచ్చిన వానికే నీడ ఇస్తుంది. దూరంగా వెళ్ళిపోయినా వారికి ఆ చెట్టు నీడను ఇవ్వలేదు. అదేవిధంగా గురువు తనకు సన్నిహితంగా వున్న శిష్యునికి విద్యనూ బోదించగలడు గాని, దూరంగా వెళ్ళిపోయినా వారికి బోధలు చెయ్యలేరు. జ్ఞానాన్ని సంపాదించ దలచిన వారు గురువుకి దగ్గరగా వుండాలి మనం మాట్లాడే మాటలలో గురువు యొక్క శక్తి వుంటుంది .. అదేవిధంగా మనం మాట్లాడే శక్తి లోను గురువు యొక్క ప్రభావం ఉంటుంది. మనలోని అజ్ఞాన అంధకారాన్ని పోగొట్టడానికి కూడా గురువే ఆధారం. లోకంలో ఎ పని చెయ్యాలన్నా గురువే ఆధారమై ఉంటాడు. అందు వలన  గురువు లేనిదే ఎ శక్తీ లేదు ..

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...