Sunday, May 14, 2017

శ్రీ కాళీకృష్ణ భగవాన్ వారి తత్త్వం

 శ్రీ కాళీకృష్ణ భగవాన్ వారి  తత్త్వం  ‘బాదంపూడి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన శ్రీ కాళీకృష్ణ సమో దేవో న భూతో న భవిష్యతి’బ్రహ్మాండంలో బాదంపూడికి సమానమైన పుణ్యక్షేత్రం లేదు. అలాగే కాళీకృష్ణ భగవాను వారికి కి సాటిరాగల దేవుడు ఇటు భూతకాలంలో కానీ.. అటు భవిష్యత్తులో కానీ మరెవరూ ఉండరు... ఇదీ శ్లోకానికి అర్థంఆనందనిలయుడైన గురువు గారి నివసించిన ఇంటిని ‘అడ్డాల మేడ ’అంటారు. ఆశ్రమాలు గూడేనికి పక్కన గ్రామము బాదంపూడి లో ఒకటి , విజయవాడ లో మిల్క్ ఫ్యాక్టరీ దగ్గర ఒకటి పెద్దవిగా ఉన్నాయి . భక్తులకు అన్నప్రసాదం అందుబాటులో ఉంటుంది. ప్రతిఒక్కరూ ఈ అన్న ప్రసాదాన్ని ఉచితంగా స్వీకరించవచ్చు. ఎంతసేపు చూసినా తిరిగి తిరిగి చూడాలనిపించే సుందర ఫాలరాతి విగ్రహాలను విజయవాడ ఆశ్రమంలో చూడవచ్చు.ఒకటి అనేకం అవటంసృష్టి. అదే బిగ్ బాంగ్(Big Bang Theory) అంటారు . అదే బిందు విస్ఫోటనం. అనేకం మరల ఆ ఒక్కటిలో చేరటం ప్రళయం. నీటిలో పడవ ఉండవచ్చు. పడవలో నీరు ఉండకూడదు. అదే విధంగా సంసారంలో (నీరు) వ్యక్తి (పడవ) ఉండవచ్చు. వ్యక్తి (పడవ) లో సంసారం (నీరు) ఉండకూడదు. నీవు అద్దె ఇంటిలో ఉంటున్న విధముగా,భగవాన్ గారు ఇచ్చిన ఈ ఇంటిలో శరీరంలో అద్దెకి ఉంటున్నట్లుగా భావించవలెను.అప్పుడే వారిని మనం తెలుసుకోగలం .
చంచలంహిమనఃకృష్ణ ప్రమాధి బలవదృఢం : చంచలప్రాణం స్థిరప్రాణమయితే అది స్థిరమనస్సుకి దారి తీస్తుంది. ఆ నిశ్చలచిత్తము జీవన్ముక్తికి సోపానము. కనుక ప్రతి వ్యక్తి హనుమాన్ అవ్వాలి. హను అనగా చంపటంమాన్ అనగా మనస్సుని. అనగా మనస్సుని స్థిరం చేయటమే హనుమాన్. మనస్సుని స్థిరం చేసుకొని బ్రహ్మ జ్ఞానముతో పండిపోయిన హనుమాన్ ఎఱ్ఱటి పెదవులు గల వాడయ్యెను. అందుకనే అహంకారంభయంసంస్కారాలురాగ ద్వేషములు మొత్తంగా అరి కట్టాలి. మహా భారతంలోని పాత్రలన్నీ ఈ అంతఃశక్తుల ప్రతీకలే. అర్జునుడు అనగా సాధకుడు అని అర్థం.న చైతద్విద్మః కతరన్నోగరీయో యద్వా జయేమ యదివానోజయేయుః                                                                                       ఈ యుద్ధమున మనము గెల్చుదుమో లేక వారే గెల్చుదురో చెప్పలేము.అర్జునుడు అనగా సాధకుడు ముందుగా తనలోని ఈ సాధనలో ముందుకు వెళ్ళగలనా లేదా అనే భయాన్ని అనగా భీష్ముణ్ణి చంపవలెను. భీష్ముడు భయానికిఅహంకారానికి ప్రతీక. విద్య మొదలు పెట్టుటకు ముందుగానే విద్యార్ధి ఉద్యోగం వచ్చునో లేదో అని భయపడి ఆలోచించి చదవకూడదు. ఉద్యోగం రానీరాకపోనీ అనేనిర్భయం విద్యార్ధికి అవసరం. ఆ తరువాత సంస్కారాల్నితనలో సంస్కారాల ప్రతీక అయిన ద్రోణుణ్ణి చంపాలి. సంస్కారాలు మంచివి అనగా బంగారు సంకెళ్ళుచెడువి అనగా ఇనపసంకెళ్ళురెండూ చంపవలెను. చివరిగా రాగద్వేషాలు అనగా తనలోని కర్ణుణ్ణి చంపవలెను. కర్ణుడు రాగద్వేషాలకి ప్రతీక. ఎవరి ఇంట్లోనైనా వ్యక్తి చనిపోతే మనం అంత బాధపడము. ఆ వ్యక్తితో సన్నిహిత సంబంధము లేదు కనుక మనం అంత బాధపడము. అదే మన ఇంట్లో వ్యక్తి చనిపోతే మిక్కిలి బాధపడతాము. కారణము ఆ వ్యక్తితో ఉన్న సన్నిహిత సంబంధమువలననే. కనుక మనము బాధ పడటానికిపడకపోవటానికి కారణము కేవలం మోహమే. కనుక సాధకుడు (ఇక్కడ అర్జునుడు)తనలోని భీష్ముణ్ణి (భయాన్ని),ఆతరువాత సంస్కారాల్ని (ద్రోణుణ్ణి)చివరిగా తనలోని రాగద్వేషాలను (కర్ణుణ్ణి) చంపుకోవలయును. అప్పుడు ఆత్మ జ్యోతి దర్శనమగును.శబ్దము కంటే వెలుగు వేగము గనుక ఆ వెలుగులో లయమైతే గొప్ప వెలుగు (మహా భారతము)  కనబడుతుంది).అందుకనే గీత మొదటి శ్లోకము ధర్మ క్షేత్రే కురు క్షేత్రే“ అనగా క్షేత్రే క్షేత్రే ధర్మకురు అనగా ప్రతి క్షేత్రంలోనూ ధర్మం అనగా యోగా ధ్యానం చేయమని చెప్పినది.





No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...