Monday, May 15, 2017

సుంద రాంగా మరువగ లేనోయ్ వరస

సుంద రాంగా మరువగ లేనోయ్ వరస :: ఆది తాళం శ్రీ కృష్ణుని పాట

పల్లవి :–
మోహనాంగా ముద్దుల కృష్ణా రావేరా
నీ కాళ్ళ గజ్జియలు ఘల్లని మ్రోగ రావేరా || మోహనాంగా ||

1. మురళీ ఊదుచు ముద్దుల కృష్ణా రావేరా
నీ కాటుక కన్నులలో మెరయు తళుకు మురిపించెరా  || మోహనాంగా ||

2. గోవర్ధన గిరి నెత్తిన కృష్ణా రావేరా
నీ కమ్మని పాటలతో , రాగములతో రావేలరా || మోహనాంగా ||

3 యశోద తనయా , యాదవ కృష్ణా రావేరా
నీ కోమల పదములను ,భజిం చెదము రావేలా || మోహనాంగా |







No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...