Tuesday, May 30, 2017

రాగం : కమాస్‌ --బ్రోచే వారెవరుర - నినువిన - రఘువర


రాగం : కమాస్‌ - చతురశ్ర త్రిపుట --బ్రోచే వారెవరుర - నినువిన - రఘువర 

బ్రోచే వారెవరుర - నినువిన - రఘువర
నీ చరణాంబుజమును నే విడజాల కరుణాలవాల॥

ఓ చతురాననాదివందిత నీకు పరాకేలనయ్య
నీ చరితము పొగడలేను నాచింతదీర్చి - వరములిచ్చి వేగమె॥

సీతాపతే నాపై నీ కభిమానములేద
వాతాత్మజార్చితపాద నామొరలను వినరాద॥

ఆతురముగ కరిరాజును బ్రోచిన వాసుదేవుడే నీవుగదా
నాపాతకమెల్ల పోగొట్టి గట్టిగ నా చైబట్టి విడవక॥

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...