ఓ రామయా - శ్రీ రామయా -- రచన : శ్రీమతి ఆకెళ్ళ రమణి, యానాం ( ప్రముఖ గాయని)
ఓ రామయా - శ్రీ రామయా
సీతమ్మ తొడ నీవు - రావేమయా
యానము గ్రామములో -మేము భజనలు చేస్తూ ఉంటామోయి
1.దశరధుని కలల పంట
కౌసల్య నోము పంట
అయోధ్య నగరములో వెలసినావయా
దాసులము నీకాయా దర్శనము నీవయ్యా
దరి చేర్చగ మమ్ము నీవు రావేమయా !!ఓ రామయా!!
2. భద్రాద్రిలో వెలసినావు
భక్తులను కాచినావు
బంగారు మాతండ్రి రావేమయా
భక్తులంత చేరినారు
భజనలు చేసినారు
భద్రాద్రి వీడి నీవు రావేమయా !!ఓ రామయా!!
3.కన్నతండ్రి మాటనిలపి
కారడవుల కెళ్ళినావు
సీతమ్మ సౌమిత్రి తోడు నీవయా
పాడి పంటలిచ్చి పిల్లాపాపనిచ్చి
యానాం గ్రామం కాచిఉండయా !!ఓ రామయా!!
No comments:
Post a Comment