Thursday, May 25, 2017

రాగం : తోడి -- వైకుంఠ వాసా శ్రీ వెంకటేశా

రాగం : తోడి      వైకుంఠ వాసా - శ్రీ వెంకటేశా

సాకి : నీ చెంత చేరగా- నీ మోము చూడగా
మా చింత తీరెగా - శ్రీనివాసా
జగమంత  నీవని - పేలచేము రమ్మని

1. వైకుంఠవాసా- శ్రే  వేంకటేశా
వెలసేవు దూరాన - న్యాయమా
ఓ పాపనాశా - ఓ తిరుమలేశా
మాపైన  నీకింకా -కోపమా !! వైకుంఠవాసా !!
2. ఆ ఏడు కొండలపైనా - సుందరనయనా
నీవు రాయిగ హాయిగా- వెలసెవులే
దాసులము నీవు- దీవించినావు
దాసుల హృదయాలు-దోచేవులే
ఈ కాలమహిమ- తెలియగ మా తరమా
ఇలవేల్పు మాకింక  నీవే సుమా  !! వైకుంఠవాసా !!
3.వేదాంతసారము నీవే - వెలుగు నీవే
సదాభక్తితో పిలిచిన -పలికేవులే
శ్రే  లక్ష్మి రమణా -శేషాద్రిశయనా
ఇలలోన ప్రతిచోట -నిలచెవులే
ఆపదమొక్కులవాడా -మమ్మాదుకొ  !! వైకుంఠవాసా !!
4.కలిలోన పుట్టించినావు -స్వామి నీవు
మా కస్టాలు తొలగించి-దరిచేర్చవా
వేలాది ప్రజలు-నీ పాద దాసులు
ఓ వాసుదేవా - మము  దీవించరావా
కొండయ్యదాసా - హృదయ నివాసా
కొండదిగి ఒకసారి - రారా ప్రబో  !! వైకుంఠవాసా !!



No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...