తత్త్వం :
చంచలంబగు జగతిలోపల శాశ్వతం బొకటిదిరా
కన్ను మూసి తెరుచులోపల కలిమిలేములు మారురా
1/మాయ సంసారంబురా ఇది - మనసు నిలకడ లేదురా
నాది నీది అనుచు నరుడా- వాదులాడ బోకురా !!చంచలంబగు!!
2.బంకమట్టి ఇల్లురా- యిది బుగ్గి బుగ్గి అవునురా
ఆలుబిడ్డలు ఆస్తి పాస్తులు అంతయూ ఏమౌనురా !!చంచలంబగు!!
3.రాజు రౌతు అనెడి భేదము -బ్రతికి వుండే వరకురా
మట్టి మట్టి కలసినాక- ఎట్టి భేదాలుందురా !!చంచలంబగు!!
4.తత్వమర్మం తెలియలేకనే- తప్పు దారిని పోకురా
ఆత్మ ఎపుడూ చావు లేకనే- అంతటా వెలుగొందురా !!చంచలంబగు!!
5.కాళి క్రిష్ణ అనుచు నరుడా - మనసు కాళీ చేయరా
శ్రే కాళీకృష్ణ అనుచు నరుడా - ఆత్మశాంతి ని బొందరా !!చంచలంబగు!!
No comments:
Post a Comment