రాగం : కామాక్షి - దేవ దేవ ధవళాచల మందిర
దేవ దేవ ధవళాచల మందిర
గంగాధర హర నమో నమో
దైవత లోక సుధాంబుధి హిమకర
లోక శుభంకర నమో నమో
1. పాలిత కింకర భవనా శంకర
శంకర పురహర నమో నమో
హాలహలధర, శూలాయుధకర
శైలసుతావర నమో నమో !!దేవ దేవ!!
2. దురిత విమోచన ఫాల విలోచన
పరమ దయాకర నమోనమో
కరి చర్మంబర చంద్రకళాధర
సాంబ దిగంబర నమో నమో !!దేవ దేవ!!
నారాయణహరి నమో నమో !!నారాయణ!!
నారద హృదయ విహారీ నమోనమో !!నారాయణ!!
పంకజనయన పన్నగశయనా !!పంకజ!!
శంకర వినుతా నమోనమో !!నారాయణ!!
No comments:
Post a Comment