Sunday, May 28, 2017

నారాయణ అనరా.. ఈ ఒక్క సారి, నారాయణ అనరా..

నారాయణ అనరా.. ఈ ఒక్క సారి, నారాయణ అనరా..
ఇంకొక్క సారి , నారాయణ అనరా.. మరొక్క సారి, నారాయణ అనరా..
నారాయణ అన నరకము తొలగును, నారాయణ అనరా…



1. కేశవ అనరాదా.. ఈ ఒక్క సారి, కేశవ అనరాదా..
ఇంకొక్క సారి , కేశవ అనరాదా.. మరొక్క సారి, కేశవ అనరాదా…
కేశవ అంటే , ఆశలు తొలగును, కేశవ అనరాదా…

2మాధవ అనరాదా.. ఈ ఒక్క సారి, మాధవ అనరాదా..
ఇంకొక్క సారి , మాధవ అనరాదా.. మరొక్క సారి, మాధవ అనరాదా..
మాధవ అంటే , మమతలు తొలగును, మాధవ అనరాదా…

3. శివ శివ అనరాదా.. ఈ ఒక్క సారి, శివ శివ అనరాదా..
ఇంకొక్క సారి , శివ శివ అనరాదా.. మరొక్క సారి, శివ శివ అనరాదా..
శివ శివ అంటే , చింతలు తొలగును, శివ శివ అనరాదా…

4. రామా అనరాదా.. ఈ ఒక్క సారి, రామా అనరాదా..
ఇంకొక్క సారి , రామా అనరాదా.. మరొక్క సారి, రామా అనరాదా..
రామా అంటే, రాగము తొలగును, రామా అనరాదా…

5.  శంకర అనరాదా.. ఈ ఒక్క సారి, శంకర అనరాదా..
ఇంకొక్క సారి , శంకర అనరాదా.. మరొక్క సారి, శంకర అనరాదా..
శంకర అంటే , శంకలు తొలగును, శంకర అనరాదా…

6. కృష్ణా అనరాదా.. ఈ ఒక్క సారి, కృష్ణా అనరాదా..
ఇంకొక్క సారి , కృష్ణా అనరాదా.. మరొక్క సారి, కృష్ణా అనరాదా..
కృష్ణా అంటే , కష్టము తొలగును, కృష్ణా అనరాదా..

7. గోవింద అనరాదా.. ఈ ఒక్క సారి, గోవింద అనరాదా..
ఇంకొక్క సారి , గోవింద అనరాదా.. మరొక్క సారి, గోవింద అనరాదా..
గోవింద అంటే , కోపము తొలగును, గోవింద అనరాదా..

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...