Sunday, May 28, 2017

రాగం : భీంపలాస్ -- జయ జయ సద్గురు భగవాన్ ( జయ జయ గిరిజా రమణ అను వరుస )

రాగం : భీంపలాస్   -- జయ జయ సద్గురు భగవాన్ ( జయ జయ గిరిజా రమణ అను వరుస )


జయ జయ సద్గురు భగవాన్ 
జయ జయ కాళీ - కృష్ణా - భగవాన్ 


1. భక్తుల పాలిట పెన్నిధి నీవే 
కరుణతో వరమొసగే వరదుడు నీవే 
మదిలో నిన్నే నమ్మితినయ్యా
మము దయచూడగ రావా దేవా !!జయ జయ

2.మదిలో ఎపుడూ మరువము స్వామి
మహిమలు చేసి చూపుము దేవా
ముల్లోకములు నీ ఆలయములే
నీ మహిమలు ఘన మా తరమౌనా !!జయ జయ


No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...