రాగం- షన్ముఖప్రియ రామయ్య గట్టించే కోలు రత్నాల మేడ కోలు
స రి2 గ2 మ2 ప ద1 ని2 స
స ని2 ద1 ప మ2 గ2 రి2 స
స రి2 గ2 మ2 ప ద1 ని2 స
స ని2 ద1 ప మ2 గ2 రి2 స
1. రామయ్య గట్టించే కోలు రత్నాల మేడ కోలు
సీతమ్మ గట్టించే కోలు సిరిపరినా సోల కోలు !! రామయ్య గట్టించే !!
2సిరిపర్నసోలాలా కోలు సిత్తారీ ముగ్గు కోలు
సిత్తారి ముగ్గు పైనా కోలు రత్నాల కమ్మడీ కోలు !! రామయ్య గట్టించే !!
3. రత్నాల కమ్మడీ పైనా కోలు వాలు చిలకాలు కోలు
వాలు చిలుకలపినా కోలు వారిద్దరయ్యా కోలు !! రామయ్య గట్టించే !!
4. రామయ్యా సీతమ్మా కోలు జూదమాడంగా కోలు
ఆడుతాడుత వచ్చే కోలు అది మాయలేడి కోలు !! రామయ్య గట్టించే !!
5. మాయాలేడికైనా కోలు మడిమే లందమ్మూ కోలు
అటుజూడురామయ్య కోలు అటుజూడావయ్యా కోలు !! రామయ్య గట్టించే !!
No comments:
Post a Comment