రాగం : శ్యామా బృందావనమది అందరిది వరస:: ఆది తాళం మంగళ హారతి పాట
పల్లవి –
మంగళ హారతి, ముదముగను
మా సీతా రాముల కివ్వరటే
సుదతు లార మీరందరు కూడి
సొంపుగ హారతు లీయరాటే || మంగళ ||
సొంపుగ హారతు లీయరాటే || మంగళ ||
1. బంగరు పళ్ళెరముల యందు
బల్ చక్కని వసంత మును బోసి
వనిత లార మీ రందరు కూడి
వేగమె హారతు లీయరటే || మంగళ ||
బల్ చక్కని వసంత మును బోసి
వనిత లార మీ రందరు కూడి
వేగమె హారతు లీయరటే || మంగళ ||
2. సీతా రాముని పొగడుచును
బహు చక్కని పాటలు పాడుచును
రమణు లార, మీ రెల్లరు కూడి
రయముగ హారతు లీయరటే || మంగళ ||
3. పునుగు జవ్వాది, అత్తరులు
బల్ చక్కని పన్నీరుల తోడ
సుగంధి తిలకము, దిద్దుచు మీరలు
యింపుగ హారతు లీయరటే || మంగళ ||
No comments:
Post a Comment