రాగం : కళ్యాణి -- ఓ రామ శ్రీ రామ నీ నామ మొకటే నిత్యమురా
ఓ రామ శ్రీ రామ నీ నామ మొకటే నిత్యమురా
నీ రూప మొకటే సత్యమురా
నిలువదు నిలువదు ఈ కాయం - ఇది మరు నిమషములో మటు మాయం
1. తనవారెవరో పరవారెవరో - తనువు రాలితే తదుపరి ఎవరో
ఉన్నంతకాలం ఎంతెంత మొహం ఎన్నడు తీరునో ఈ వింత దాహం !! ఓ రామ శ్రీ రామ !!
2. ఇల్లు మిగలదు ఇల్లాలు మిగలదు - నాదనుకున్నది ఏది మిగలదు
చివరకు మిగిలేది చేసిన పుణ్యం - అది చేయగలిగిన బ్రతుకే ధన్యం !! ఓ రామ శ్రీ రామ !!
3. కలిమిలేములు వెలుగు నీడలు - హోరుగాలిలో వూగే ఓడలు
కడలి దాటితే తన గెలుగు కాదూ - నడుమ మునిగిన ఓటమి కాదూ !! ఓ రామ శ్రీ రామ !!

No comments:
Post a Comment