Sunday, May 28, 2017

రాగం : యమునకల్యాణి -- అమ్మ రావే కలకత్తా కాళివే

రాగం : యమునకల్యాణి  -- అమ్మ రావే  కలకత్తా కాళివే

 అమ్మ రావే  కలకత్తా కాళివే -- మా అమ్మ రావే విజయవాడ దుర్గవే
1. కంచిలోనా  కామాక్షివే - మధురలోనా  మీనాక్షివే
అమలాపురంలోనా - నూకాలమ్మవే
మురమళ్ళలోనీవూ - మాణిక్యాంబావే !!  అమ్మ రావే !!

2. వానపల్లిలో పల్లాలమ్మవే - పెద్దాపురములో మరిడమ్మవే
భీమవరంలో మావుళ్ళమ్మవే - లోవకొత్తూరులో తలుపులమ్మవే !!  అమ్మ రావే !!

3. గరగలెత్తి  ఆ సాధులు గంతులేసి ఆడారు
డప్పులు తాళాలూ  డమ్ ఢమ మని మ్రోగాలి
అమ్మ తల్లి జాతర ముమ్మరంగా జరగాలి !!  అమ్మ రావే !!

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...