రాగము: శ్రీరాగం-చాలదా హరినామ
| చాలదా హరినామ సౌఖ్యామృతము దమకు చాలదా హితవైన చవులెల్ల నొసఁగ | ॥పల్లవి॥ |
| ఇదియొకటి హరినామ మింతైనఁ జాలదా చెదరకీ జన్మముల చెఱలు విడిపించ మది నొకటె హరినామ మంత్రమది చాలఁదా పదివేలు నరకకూపముల వెడిలించ | ॥చాలదా॥ |
| కలదొకటి హరినామ కనకాద్రి చాలదా తొలఁగుమని దారిద్ర్యదోషంబు చెఱుచ తెలివొకటి హరినామ దీపమది చాలదా కలుషంపు కఠినచీఁకటి పారఁద్రోల | ॥చాలదా॥ |
| తగువేంకటేశు కీర్తన మొకటి చాలదా జగములో కల్పభూజంబు వలెనుండ సొగిసి యీ విభునిదాసుల కరుణ చాలదా నగవుఁజూపులను నున్నతమెపుడుఁ జూప | ॥చాలదా॥ |
No comments:
Post a Comment