Tuesday, May 30, 2017

రాగము: ముఖారి -బ్రహ్మఁ గడిగిన


రాగము: ముఖారి -బ్రహ్మఁ గడిగిన
బ్రహ్మఁ గడిగిన పాదము
బ్రహ్మము దానె నీపాదము
॥పల్లవి॥
చెలఁగి వసుధ గొలిచిన నీపాదము
బలి తల మోపిన పాదము
తలఁకక గగనము దన్నిన పాదము
బలరిపుఁ గాచిన పాదము
॥బ్రహ్మ॥
కామినిపాపము గడిగిన పాదము
పాముతల నిడిన పాదము
ప్రేమపు శ్రీసతి పిసికెడి పాదము
పామిడి తురగపుఁ పాదము
॥బ్రహ్మ॥
పరమయోగులకుఁ బరిపరి విధముల
పరమొసఁగెడి నీపాదము
తిరువేంకటగిరి తిరమని చూపిన-
పరమపదము నీపాదము
॥బ్రహ్మ॥

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...