రాగం : చక్రవాకం నీ కొండకు నీవే రప్పించుకో - ఆపద మొక్కులు
నీ కొండకు నీవే రప్పించుకో - ఆపద మొక్కులు మాచే ఇప్పించుకో
ఓ తిరుమల వేంకటేశ - ఓ తిరుమలేశా
నీ విచ్చిన ఈ జన్మకు - విలువ కట్టుకో
1. కొండంత సంసారం- మోయలేని మానవులం
ఏడుకొండలెక్కి రమ్మంటే రాలేము
సాటిమనిషి సౌఖ్యానికి సాయపడని దుర్భలులం
స్వర్గానికి నిచ్చెనలు వేయలేము !! నీ కొండకు !!
2. మా మనసు మా హృదయం పరమశత్రులై
మా లోపలి దివ్య జ్యోతి మసకేసిపోతున్నది
అహంకమణగించి మమకారము తొలగించి
చేయూతనిచ్చి మమ్ము చేరదీసుకో !! నీ కొండకు !!

No comments:
Post a Comment