Saturday, May 27, 2017

రాగం : ఆరభి -- కృష్ణా కొలవాలీ - నీ నామమునే చేయాలి

రాగం : ఆరభి        కృష్ణా  కొలవాలీ - నీ నామమునే చేయాలి

    కృష్ణా కొలవాలీ - నీ నామమునే చేయాలి
    నీబాటలలో నడవాలీ - నీ కైవల్యమునే పొందాలి కృష్ణా
1. నిన్ను కొలిచే తీరేవేరు -నిన్ను కొలిచే ధారేవేరు
ఐహికమైన వాంఛలతోనూ - నిన్ను ధ్యానించుట తగదు కృష్ణా !!కృష్ణా కొలవాలీ !!
2. ప్రేమించే హృదయములోనా -సేవించే జీవులలోనా
నివసించేటి  దేవుడవందురు -నిజమేనా కృష్ణా !!కృష్ణా కొలవాలీ !!
3.ఈ మాయల వలలో మేము - జీవించుచు మన లేమూ
భాదల నుండి మము విడిపించి - నీలో నిద్దుర పోనీ !!కృష్ణా కొలవాలీ !!

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...