Sunday, May 28, 2017

రాగం : కళ్యాణి -- సిద్ధయా కాళీ సిద్దయా ఇల నిను నమ్మి కొలిచామయా

రాగం : కళ్యాణి -- సిద్ధయా  కాళీ సిద్దయా  ఇల నిను నమ్మి కొలిచామయా 

సిద్ధయా  కాళీ సిద్దయా  ఇల నిను నమ్మి కొలిచామయా
నిను పూజింతుము నిను సేవింతుము మము  దరిచేర్చరావా ప్రభో

1. నమ్మిన  శ్రీ మన్నారాయణకు - సర్ప గండంబు తప్పించినావాయ
సర్ప రాజులకు రాజువై వెలచావయ్యా - నాగవతారుడై నిలచావయా !! సిద్ధయా  కాళీ సిద్దయా !!

2. సంతానము లేని శర్వాణీకి నివు - బాల నిచ్చి ఉన్నావయా
ఈశ్వరా నిను నమ్మి కొలిచామయా - కాళీ సిద్దయ్య మేము బ్రోవ రావేమయా !! సిద్ధయా  కాళీ సిద్దయా !!

3. బాదంపూడి గ్రామమందునీవు - అవతారరూపుడని నమ్మేమయా
భక్తులూ  నిను నమ్మి కొలిచెరాయా - మేము బ్రోవ రావయ్యా ఓ సిద్ధుడా !! సిద్ధయా  కాళీ సిద్దయా !!

4. యానంలో వెంకటేసుకు మీరు ఆపరేషన్ చేసి ఉన్నారయా
వైద్యులకు వ్యాధుడవు నీవే  నయా - భవరోగ వైద్యుడై  నిలిచేవాయా !! సిద్ధయా  కాళీ సిద్దయా !!

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...