Sunday, May 28, 2017

రాగం : మోహన రాగం -- మహిమ తెలియగలరా

రాగం : మోహన రాగం -- మహిమ తెలియగలరా
మహిమ తెలియగలరా నీ లీల లెరుంగ గలరా 
1.ఇహ పరములలో ఎంతటి జ్ఞానులు 
ఎంతటి వారలు ఇసుమంత గూడన !!మహిమ!!


2.అమరేంద్రాదులు ఆదిశక్తివని 
అనవరతము నిన్నరాధించుచు !మహిమ!!

3.వేదవేద్య నీవే దిక్కని నిన్ను
వేదములన్నియును ప్రస్తుతించుచును !మహిమ!!

4.సిద్దులమంచును చెప్పుచు తిరిగెడి
సిద్దులకైనను ప్రసిద్దులకైనను !మహిమ!!

5.వారను వీరను భేదము లేకను
వారికి వీరికి మధ్యనుండునీ !మహిమ!!

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...