రాగం : తోడి -- కనరావేల కలియుగ దీపమా
కనరావేల కలియుగ దీపమా
వినరావేల పిలిచిన లోపమా
సిద్ధ దేవుండా నన్నేల దయచూడవా
1.దిక్కు తెలియక దీనుండ నైతిని
విశ్వరూపుడ ఓ కాళీసిద్ద
వింతవింతల ఓ సిద్ధదేవ
కనికరించి నను బ్రోవవా !! కనరావేల !!
విశ్వరూపుడ ఓ కాళీసిద్ద
వింతవింతల ఓ సిద్ధదేవ
కనికరించి నను బ్రోవవా !! కనరావేల !!
2.నిన్ను చూడక నే భాదపడితి
చూసినంతనే సంతోష పడితి
ఎన్ని జన్మల నా పుణ్యఫలమొ
ఈ జన్మలోనే తరియించితీ !! కనరావేల !!
చూసినంతనే సంతోష పడితి
ఎన్ని జన్మల నా పుణ్యఫలమొ
ఈ జన్మలోనే తరియించితీ !! కనరావేల !!
3.విడని యతలే సంసార మందూ
పడని పాట్లే పడుచుంటినయ్యా
నీ దివ్యతేజము మా హృదయమందు
ప్రకాశింపచేయీ ప్రభూ !! కనరావేల !!
పడని పాట్లే పడుచుంటినయ్యా
నీ దివ్యతేజము మా హృదయమందు
ప్రకాశింపచేయీ ప్రభూ !! కనరావేల !!
No comments:
Post a Comment