Sunday, May 28, 2017

సరస్వతే ప్రార్ధన --- అమ్మవు నీవే - అఘనిత రావే

సరస్వతే ప్రార్ధన
పల్లవి : అమ్మవు నీవే - అఘనిత రావే
కమ్మని వాక్కులీయవే సరస్వతి
అమ్మా మా భారతీ - ఓ ఓ ఓ
1.కవుల గాయకులకెల్ల కల్పవృక్షమంటివి
కమ్మని వాక్యాలు నిచ్చు కన్నతల్లి వింటిని
కదిలించే హృదయాల వీణాపాణి !!అమ్మవు నీవే
2.సకలకళాస్వరూపిణి సత్యవాక్కులిమ్మని
భక్తిగ నిను దలఁచితినే ముక్తిని జూపే పావనీ
ఇల నీవే , కనరావే , వీణాపాణి  !!అమ్మవు నీవే
3.స్థిరముగ  నా మదిలో తిరుగాడే పావని
తప్పులెందు కొచ్చునిక తనయని పూజయని
యదనీవే మధువాణి వీణాపాణి !!అమ్మవు నీవే
4.అమ్మా నా పూజలివే బ్రహ్మలోక రాణి వి
అందవె కనకారావుని ముందు హంసవాహిని
ఎదనీవే , మధు వాణి , వీణాపాణి  !!అమ్మవు నీవే
"""""""""""""""""""""""""""""

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...