Sunday, May 28, 2017

రాగం : మాల్ కోస్ -- ఎంతెంత దయ నీది ఓ సాయి

రాగం : మాల్ కోస్  --  ఎంతెంత దయ నీది ఓ సాయి 

ఎంతెంత దయ నీది ఓ సాయి
నిను ఏమని పొగడను సర్వాంతర్యామి

1. తొలగించినావు వ్యాధుల ఊఁ దితో
వెలిగించినావు దివ్వెల నీటితో
సతులకు అందవు -సుతులకు పొంగవు
పాపాలు కడిగేటి -పావన గంగవు !!ఎంతెంత దయ నీది ఓ సాయి !!

2.భక్త కబీరే - నీ మాట మన్నావు
భగవానుడే -నీ కులమన్నావు
అణువణువునా నిండిన బ్రమ్మాండంబు
అందరిలోనేవే కొలువున్నావు  !!ఎంతెంత దయ నీది ఓ సాయి !!

3. ప్రభవించినావు -మానవ మూర్తివై
ప్రసరించినావు - ఆరనిజ్యోతివై
మారుతి నేవే - గణపతి నీవె
సర్వ దేవతల- నవ్యా కృతి నీవే !!ఎంతెంత దయ నీది ఓ సాయి !!

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...