Monday, May 29, 2017

రాగం: అరబి -- దైవమా నీ వెవరయ్యా తెలుపగా రావేమయ్యా

రాగం: అరబి -- దైవమా నీ వెవరయ్యా  తెలుపగా రావేమయ్యా 

 దైవమా నీ వెవరయ్యా - తెలుపగా రావేమయ్యా
1. రాముడు నీవే కృష్నుడు నీవే - ఏసుక్రీస్తు అల్లా నీవే
హిమగిరి నందున పశుపతి నీవే - తిరుమల గిరిపై వెంకట పతివై !!దైవమా నీ వెవరయ్యా !!
2. ఆదియు నీవే అంతము నీవే - జననమరణముల మర్మమునివే
చీకటి వెలుగుల చిత్రము నీవే - కష్ట సుఖాలకు కర్తవు నీవే !!దైవమా నీ వెవరయ్యా !!
3. ఏ పేరున నిను నే పిలవాలి - ఏ రూపముగ నిను నే కొలవాలి
సర్వము నిండిన అంతర్యామి - భక్తజయంతిని కనరావేమి !!దైవమా నీ వెవరయ్యా !!

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...