Wednesday, May 31, 2017

రాగం : బీమ్ పలాస - మానవుడా మమత వీడరా


రాగం : బీమ్ పలాస - మానవుడా మమత వీడరా
మానవుడా మమత వీడరా
మమత వీడి రామ నామ స్మరణ చేయరా

1. రామ నామ స్మరణ చేసి ఆత్మ సుఖము నొందరా
ఆత్మ సుఖము కన్నమిన్న అన్య మేది లేదురా..

2. నాది నీది యనెడి మూఢ తత్వము విడనాడరా
యెంచి చూడ జగతి లోన ఏది నీది కాదురా

3. మానవ ధర్మమును వీడి దానవుడవు కాకురా
మాయకు లోబడిన నీవు మానవుడవు కాదురా

4. ఆలుబిడ్డ లన్నదమ్ము లెవరు వెంట రారురా
వదలలేక వచ్చినా వల్లకాడు వరకెరా

5.ఉన్న దాని తోడ నీవు తృప్తి నొంది యుండరా
తృప్తి లేని మానవుడే దుఃఖ మనుభవించురా .... 

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...