Tuesday, May 23, 2017

రాగం : భాగేశ్వరి --- ఎక్కడ ఉన్నవో స్వామి

రాగం : భాగేశ్వరి  ఎక్కడ ఉన్నవో

ఎక్కడ ఉన్నావో  స్వామి  ఒక్కసారి అగుపించవేమి
1. నీ  ఉన్నావని  నే విన్నాను
కనులారగ నిను కనలేకున్నాను
ఏమి చిత్రమో ఈ సంకల్పము
ఎరుగరానిది నీ దివ్యరూపము !!ఎక్కడ ఉన్నావో
2.ఈ జగమే ఒక నాటక రంగం
ఆదే  పాడే బొమ్మలు మేము
ఆడించి పాడించి ఏడ్పింతువయ్య
అగుపించకుండా నగుచుందువయ్యా !!ఎక్కడ ఉన్నావో
3.మాయాసంసారములో మమ్ముంచినావు
మా కళ్ళకు మాయ తెర వేసినావు
నివురు గప్పిన నిప్పు వైతివా
నీ మాయ తొలగించి అగుచుందువయ్యా !!ఎక్కడ ఉన్నావో

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...