Tuesday, May 23, 2017

రాగం : కళ్యాణి కైలాస శంకరా పార్వతి పరమేశ్వరా

రాగం : కళ్యాణి

 కైలాస శంకరా పార్వతి పరమేశ్వరా
శ్రీ నీలకంటేశ్వరా శంకరా శ్రీ చంద్రమౌళేశ్వరా -- హర\హర హర

1.గంగ యమునా సరస్వతి -తుంగభద్ర గోదావరి
చంద్రభాగ దర్శన కావేరి కృష్ణా
ఇన్ని నదులు నీలోనా  ఇమిడి ఉండగా
నీ విశ్వరూపం చూపవయ్యా శంకరా !! కైలాస శంకరా !!
2. ఓం నమశివాయ ఓం గణనాదాయ
ఓం కార రూపా  శివా శంకరా
నీ పంచాక్షరీ పఠన చేయువారలా
జ్ఞాన మొసగి చూడవయ్యా శంకరా
విజ్ఞాన మోసగి బ్రోవుమయ్య శివశంకరా !! కైలాస శంకరా !!
3.మరణకాలమందు నిన్ను మరతు నేమో కానీ
మరపురాని వరాలివ్వు శివశంకరా
ఇది మాయ భూటకంబు ప్రపంచ శంకరా
ఈ జన్మ సార్థకంబుచేయు శంకరా
ఈ జన్మ సార్థకంబుచేయు అభయశంకరా
ఓం నమశివాయ ఓం నమశివాయ
హర హ్రర నమశివాయ శివ శివ నమశివాయ  !! కైలాస శంకరా !!

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...