రాగం : మోహన - శివ శివ శంకర భక్తవ శంకర
శివ శివ శంకర భక్తవ శంకర
శంభో హర హర నమో నమో
పున్నెము పాపము ఎరుగని నేను
పూజలు సేవలు తెలియని నేను
ఏ పూలు తేవాలి నీ పూజకు
ఏ లీల చేయాలి నీ సేవలు !!శివ శివ శంకర!!
మా ఱేడు నీవని ఏరేరి తేనా
మారేడు దళములు నీ పూజకు
గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని
గంగను తేనా నీ సేవకు !!శివ శివ శంకర!!
మా ఱేడు నీవని ఏరేరి తేనా
మారేడు దళములు నీ పూజకు
గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని
గంగను తేనా నీ సేవకు !!శివ శివ శంకర!!
No comments:
Post a Comment