Sunday, May 28, 2017

రాగం : రేవతి -- వేదాలు మంత్రాలూ రానే రావూ

రాగం : రేవతి -- వేదాలు మంత్రాలూ రానే రావూ

వేదాలు మంత్రాలూ రానే రావూ
రాగ తాళాలు సంగీతం అసలే రాదూ
తెలిసీ తెలియని భక్తితో ఓ దుర్గమ్మా
ప్రతీరోజు నీ నామం పాడెదమమ్మా

1. తూర్పున గోదావరి నదీ తీరము
సకల కళా శోభితము యానములో
పుదుచ్చేరి యానము పట్నమందున
ప్రతీరోజు నీ నామం పాడెదమమ్మా !! వేదాలు మంత్రాలూ !!

2. తిక్కన్న నన్నయ్య కవి పోతనలా
నీ కథను వ్రాయగలుగు జ్ఞాన మేధమ్మా
త్యాగయ్య అన్నమయ్య రామదాసులా
నీ పాటలు పాడగలుగు భాగ్యమెదమ్మా !!  వేదాలు మంత్రాలూ !!

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...