Wednesday, May 31, 2017

రఘురాము లంపే నమ్మ



రఘు రాము   లంపే నమ్మ, 
నీ జాడలో వచ్చితి ఇదిగో కొమ్మ! -- రఘు --

కామిని నా మాట కల్ల కాదు రామ
స్వామి పాదములాన సంశాయిమ్పకు తల్లి -- రఘు --

నెలకు రమ్మని చెప్పెను సుగ్రీవుని
నేరకులేన్నుత దప్పెను గలగ్రామరన్యములు
కలియ దిరుగుచు రాగా
నిలలోన మా కష్టమిపుడు ఫలియించెను -- రఘు --


అల దుఃఖ సుఖములన్ని దేవునికైనా
ననుభావిన్పక తీరునా ?
బలరక్కసుని లంక పాడు పాడుగా జేసి
జలజాక్షి నీ విభుడు నిజముగా నిన్నెలు -- రఘు --

తలచి చూడుము ఇదిగో
మా మంథెన్న దేవు నున్గారమిడుగో
తలపున వెరువక ధైర్యమొందవే తల్లి !
కలవరిన్పుచు నిన్ను ఘడియైయ మరువడు -- రఘు --

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...