Friday, May 26, 2017

రాగం : బాగేశ్వరి -- బెజవాడ దుర్గంబవే బెజవాడ దుర్గంబవే

రాగం : బాగేశ్వరి     బెజవాడ దుర్గంబవే - బెజవాడ దుర్గంబవే  

బెజవాడ దుర్గంబావే - బెజవాడ దుర్గంబవే  
నా  నిజదేవి - నీవే  భవానీ
1.మల్లేశ్వరుని ఇల్లాలివని -యుల్లము నీకై వేడితిమి
ఎల్లరు నీవే- చల్లని తల్లి
ముల్లోక జనని -నీవే భవానీ !! బెజవాడ దుర్గంబావే !!
2.విద్యల పురము - విజయవరము
నిజముగ  నిన్నే -పూజింతుము
భక్తుల బ్రోచి - ముక్తిని జూపే
భ్రమరాంభవే-కనకదుర్గంబవే  !! బెజవాడ దుర్గంబావే !!
3.నిండుగా నీవే - కృష్ణానదిపై
 కొండల్లో నా - వెలి శావా
దండిగ నీకై- భక్తజనావళి పూజింతు నీ కొండకై వత్తురు  !! బెజవాడ దుర్గంబావే !!

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...