Tuesday, May 30, 2017

రాగం : మోహన - సామి దయ మీరా

రాగం : మోహన - సామి దయ మీరా

సామి దయ మీరా చెలి నేలుకోరా
ఈ మోడి తగునేమిరా చలమా ముమ్మాటికిని     ||సామి||

భూమి వెలసిన శ్రీ కరివరద 
నేరమున నెరనమ్మిన జాణను 
ముదమొదవక సరసకు పిలువర ఇక                ||సామి||


రారా వగలేల ఇపుడేలరా 
మా బాలను నీ దానిగా నేలుకో 
జలిజెంది దయతో పలుమారను 
గారవమున పలుకర విరసమొలదు                  ||సామి||

ఇంతి జనుల మేల్బంతి నడల
చౌదంతి చనుల పంతుల బిగువెంటని 
పంతగించి మంతుకేక్కు కంతుని 
చేతిబంతిరా పరాకు వలదుర                            ||సామి||

మరులు మీర మరుని దూరి సారెకు 
విరహమొంది మరుకేళిని గూడర
నిరతము కనికరమున కరమరుదుగ 
మరి మరి నిను శరణనెర మరువకిక                 ||సామి||

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...