Monday, May 29, 2017

రాగం : మాల్ కోస్ -- మహేశా పాప వినాశ కైలాస వాసా ఈశ

రాగం : మాల్ కోస్ -- మహేశా పాప వినాశ కైలాస వాసా ఈశ
మహేశా పాప వినాశ  - కైలాస వాసా ఈశ
నిన్ను నమ్మినాను రావే - నీలకంఠరా

భక్తి ఏదో పూజ లేవో తెలియనైతినే
పాపమేదో పుణ్య మేదో కాన నైతినే  !! మహేశా పాప వినాశ  !!

1. మంత్రయుక్త పూజచేయ మనసు కరుగునా
మంత్రమో తంత్రమో ఎరుగనైతినే
నాదమేదో వేదమేదో తెలియనైతినే
వాదమేల పేద బాధ తేర్చరావయా !! మహేశా పాప వినాశ  !!

2. ఏక చిత్తమున నమ్మిన వారికి
శోకము తీర్చును రుద్రయ్య
వ్రాతకముఖ చిరుపేట చూపిన
ఆకలి తీర్చగ రావయ్యా
దీటుగ నమ్మితి గనవయ్యా
దారిచూపుము రుద్రయ్య
ముక్తి నొసగుము రుద్రయ్య !! మహేశా పాప వినాశ  !!


No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...