Thursday, June 1, 2017

ఏమయ్యా ఓ రామయ్య ఎట్టా సేవించాలయ్య

ఏమయ్యా ఓ రామయ్య, ఎట్టా సేవించాలయ్య
నిను ఏమని కీర్తిన్ చాలయ్య , ఏమయ్యా ఓ రామయ్య

పదములు పడదాం అనుకుంటే
మారుతి చరణాలు ఒదలడు
ఫలములు అర్పిద్దము అంటే
పాపం శబరికి బెదురు
పాదం కడగాలనుకుంటే
పద పది గృహుడే తయ్యారు
ప్రాణాలు ఇద్దాము అనుకుంటే
పక్షి జటాయువు లుంటారు --ఏమయ్యా ఓ రామయ్య --


కమ్మని చరితము రాదామంటే
కవి వాల్మీకిని కానయ్య
గానముతో కొలవాలంటే
ఘన త్యాగయ్యను కానయ్య
ఆశతో కోవెల కడదామంటే
తాసిల్ దారును కానయ్య
ఆఖరికి మనసిద్దమంటే
అది ఏనాడో .... నీదయ్య -- ఏమయ్యా ఓ రామయ్య --

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...