Thursday, June 1, 2017

జయహొ జయ వీరాంజనేయ,



పల్లవి
జయహొ జయ వీరాంజనేయ,
దయతో దారి చూపించవయ్యా,
రావా ప్రభో, దేవా ప్రభో, రావయ్య వీరాంజనేయ,
నువ్వు రావయ్య … వీరాంజనేయ -- జయహో --

రామ బంటువి నీవయ్య రామా ,
ప్రేమ మీరగా రావయ్య … ఆ ఆ
భీమ బలుడవు నీవయ్య…., పామరుడవై రావయ్య
నియమముగా నీ పూజలు, చేసేము మనసారా -- జయహొ--

రామ చంద్రుని గీతాలు రామా
లోకమంతా రతనాలు …. ఆ… ఆ…
నీవు మెచ్చిన పుష్పాలు, రామ చంద్రుని హారాలు
నియమముతో నీ భజనలు చేసేము మనసారా -- జయహొ --


మాటి మాటికి మనసారా … నీ….,
పాట పాడెద ప్రభు రారా -
కోటి దండాలు నీకేరా….., మేటి దోరగా గైకొనరా
నీ పూజలు, నీ భజనలు చేసేము మనసారా -- జయహొ --

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...