రాగం : తోడి
మనసార హరి భజన చేయరా, నీ నోరార నారాయణా అనరా
నీ నోరార నారాయణా అనరా -- మనసారా--
పాటే రాదనీ, ప్రజలు అందురని, గాత్ర శుద్ధియే కమ్మగా లేదని..
పాటకు సరిపడు తాళము లేదని -
భయము బిడియము బాధ వలదురా -- మనసార--
పాటయు తాళము, గాత్రము యున్నాను, మనసే లేని స్మరణే వృధరా..
తనువొక చోట, మనసొక చోట
ఉన్న మానవుని జన్మయే వృధరా -- మనసార--
రోగియైన మహా భోగియైన, పూర్వజన్మ సుకృతము పోదురా
నారాయణా నీ నామ స్మరణతో
నరకపు బాధలు నాశ మవునురా -- మనసార--

No comments:
Post a Comment