Monday, June 5, 2017

మచ్చ కూర్మ వరాహ మనుష్యసింహ వామనా

మచ్చ కూర్మ వరాహ మనుష్యసింహ వామనా
యిచ్చ రామ రామ రామ హితబుద్ధి కలికీ // పల్లవి //

నన్నుఁ గావు కేశవ నారాయణ మాధవ
మన్నించు గోవింద విష్ణు మధుసూదన
వన్నెల త్రివిక్రమ వామనా శ్రీధరా
సన్నుతించే హృషికేశ సారకు పద్మనాభ // మచ్చ //

కంటిమి దామోదర సంకర్షణ వాసుదేవ
అంటేజాలు ప్రద్యుమ్నుఁడా అనిరుధ్ధుఁడా
తొంటే పురుషోత్తమ అథోక్షజ నారసింహమా
జంటవాయకు మచ్యుత జనార్దన // మచ్చ //

మొక్కేము వుపేంద్ర హరి మోహన శ్రీ కృష్ణరాయ
యెక్కితి శ్రీ వేంకట మిందిరానాథ
యిక్కువ నీ నామములు యివియే నా జపములు
చక్కఁగా నీ దాసులము సర్వేశ అనంత // మచ్చ //

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...