Monday, June 5, 2017

గరుడగమన రారా నను

గరుడగమన రారా నను
నీ కరుణ నేలుకోరా
పరమపురుష ఏ వెరపులేక నీ
మరుగుజొచ్చితిని అరమర సేయకు // పల్లవి //

పిలువగానే రమ్మి
అభయము తలపగానే యిమ్మి
కలిమిబలిమి నాకిలలో నీవని
పలవరించితిని నలువను గన్న // గరుడ //

పాలకడలి శయనా దశరథ
బాల జలజ నయనా
పాలముంచినను నీటముంచినను
పాలబడితినిక జాలము సేయకు // గరుడ //

ఏలరావు స్వామీ నను
నీవేలుకోవదేమి
ఏలువాడవని చాలనమ్మితిని
ఏలరావు కరుణాలవాల హరి // గరుడ //

ఇంత పంతమేల
భద్రగిరీశ వరకృపాల
చింతలణచి శ్రీరామదాసుని
అంతరంగపతివై రక్షింపుము // గరుడ //

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...