బీమ్ పలాస : గిరిపై నున్నావా దేవా నీవీ
గిరిపై నున్నావా దేవా నీవీ
భువిపై కిక దిగి రావా దేవా
1. సప్త గిరులలో శేషశయ్యపై
యోగ నిద్రలో మునిగియుంటివా
పూరిగుడిసెలో కటికనేలపై
కునుకు పట్టక కుములు చుంటిని !! గిరిపై నున్నావా !!
2. నీవు వత్తువని నిన్న రాత్రి గని
హృదయ కవాటము తెరచియుంచితిని
రాలేదని నా కన్నులు నీకై
కొలువలై గోదావరి వరదలై !! గిరిపై నున్నావా !!
3. మట్టిబొమ్మనని తెలుసుకొంటిని
గట్టి దైవమని నమ్మియుంటిని
కట్టితి నీకై హృదయ కోవెల
కొలువు తీర్చుకో వెంకటేశ్వరా !! గిరిపై నున్నావా !!

No comments:
Post a Comment