Monday, June 5, 2017

ఎన్నెన్నో జన్మల పుణ్యం నాకీ జన్మ

ఎన్నెన్నో జన్మల పుణ్యం నాకీ జన్మ
ఎన్నటికీ మరువను రమణా  నీ పదస్మరణా
ఒక్క క్షణం నిను వీడి నే నుండలేనూ
ఒక్క క్షణం నీ పదము నే వీడలేను

1. బంగరు కొనలలోనా - వెలసినవాడా
భక్తుల హృదయములోనా భవభయహరణా
ఓ తిరుమలేశా శ్రీ వెంకటేశా
నీ చరిత మెల్ల వేళలందు పాడనా
పాడనా పాడనా !!  ఎన్నెన్నో జన్మల  !!

2. ఏడుకొండలపైనా - వెంకటరమణా
ఈ బువి యందున వెలసి సంకటహరణా
ఈ చిత్ర లోకం నీ దివ్య రూపం
నే తెలియలేను దేవదేవ గావరా గావరా గావరా !! ఎన్నెన్నో జన్మల  !!

3. కోటి జన్మలకైనా - కోరేదొకటే
నీ పదసన్నిది ఎపుడూ మా కుండాలి
నీ చెలిమి చాలు ఆ స్వర్గమెలా
నీ కరుణ ఎల్ల వేళలందు జూపవా  జూపవా  జూపవా !! ఎన్నెన్నో జన్మల  !!

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...